Saturday, 15 December 2012




కెరటం పడిపోయినపుడే మల్లి లేవగాలుగుతుంది.

అలాగే 

జీవితంలో ఓటమియే గెలుపుకి దారిచుపుతుంది

ప్రతాప్ 

జీవితంలో చావు ఎప్పుడు పరిష్కారం కాదు...





జీవితంలో చావు ఎప్పుడు పరిష్కారం కాదు...
ఏ సమస్యకైన పరిష్కారం వుంటుంది...

సచ్చి సాధించేది ఏమిలేదు...
కానీ బ్రతికీ జయించడానికి ప్రపంచం వుంది..



ప్రతాప్

అమ్మ I LOVE YOU







అమ్మ అన్న మాటని మరవలేను....

అమ్మ చేతిని ఎన్నటికి విడవలెను 


ప్రతాప్

వర్షకాలం తస్మాత్ జాగ్రత్త


వర్షకాలం తస్మాత్ జాగ్రత్త 




వర్షాకాలం వచ్చింది అంటే అందరు ఎంతో సంతోషపడతారు, ఎందుకంటే చల్లని గాలులు, సాయంకాలం ఆహ్లాదకరమైన వాతావరణం, చిరుజల్లు కురుస్తుంటే తడుస్తూ ఆడాలి అన్న ఆశ, వర్షం కురుస్తుండగా వేడి వేడి బజ్జీలు తింటే హుహూహు... ఆమజానే వేరు.. ...!

కానీ ఇలాంటి ఆనందంలో... మన ఆరోగ్యాన్ని మరిచి పోవద్దు తగిన జాగ్రతలు తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

ఇంటిబయట వెస్ట్ సామాన్లు ఉంచవద్దు వాటిల్లో నీళ్ళు నిలిచి ఆరోగ్యం దెబ్భ తినే ప్రమాదం వుంది.

మీ ఇంటి చుట్టూ మురికి కాలువలలో నిరు నిలువకుండా చూసుకోండి. ఒకవేళ నిలిచినట్లితే వెంటనే సంభందిత మునిసిపాలిటి కార్యాలయంలో చెప్పి వెంటనే శుభ్రం చేయించండి.

రేకుడబ్భాలు, రబ్బరు టైర్ లాంటివి మేడపై కానీ , ఆరుబయట కానీ ఉంచకండి వర్షం నిరు నిలిచి ఆరోగ్యం దెబ్భ తినే ప్రమాదం వుంది.

మిచుట్టు పరిసరప్రాంతాలు శుభ్రంగా వుంచండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి...



ప్రతాప్
 



Wednesday, 1 August 2012

రక్త దానం చేయండి ఒక జీవితాన్ని కాపాడండి






మికుతెలిసింది నలుగురికి చెప్పండి.. 

మీకు తెలియనిది అడిగి తెలుసుకోండి..

ఈ సమాచారం మీ మిత్రులకి కూడా చెప్పండి 


రక్త దానం చేయండి ఒక జీవితాన్ని కాపాడండి 



ప్రతాప్ 

Sunday, 15 July 2012

స్వర రాగా గంగా ప్రవాహమే అంగాత్మ సందన యోగమే...





స్వర రాగా గంగా ప్రవాహమే అంగాత్మ సందన యోగమే...
ప్రాప్తే వసంతేతి కాళికే పలికే కుహు గీతిక
గాన సరసీరుహ మాలిక స్వర రాగా గంగా ప్రవాహమే........

చరణం:

కుండల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్లకే
పిల్లన గ్రోవిలో పిలవని మోవిలో కురిసెను రాగం ఈ నాటికీ
మట్టింటి రాయే మాణిక్య మై పోయే సంగీత రత్నాకరాన
స్వర సప్త కాలే కెరటాలు కాగ ఆ గంగా పొంగింది లోన
స్వర రాగా గంగా ప్రవాహమే అంగాత్మ సందన యోగమే

చరణం:

చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమ వీడి వినిపించు రాగ లనతలు లే
ఈ ఈ చక్ర వాకాలు ఎగిరే చకోరాలు జగమంత విహరించు రాగాలు లే
పిలిచే శాకుంతలు పలికే దిగంతాలు పులకింత ల పుష్య రాగాలు లే
మాలి సంధ్య దీపాలు గుడి గంట నాదాలు మౌనాక్షరీ గణ వేదాలు లే
స్వర రాగా గంగా ప్రవాహమే అంగాత్మ సందన యోగమే
ప్రాప్తే వసంతేతి కాళికే పలికే కుహు గీతిక
గాన సరసీరుహ మాలిక స్వర రాగా గంగా ప్రవాహమే



                       ప్రతాప్




Thursday, 5 July 2012

64 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో..




64 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో..
గొప్ప సంస్కృతిని పోదిగివున్న ఈ పసిడి దేశంలో...
భుతల్లి గర్భశోకం ఎందుకు పెడుతుంది....
తనబిడ్దల ఆకలిని తను ఎందుకు తిర్చలేకపోతుంది...
కన్నతల్లి కంట శోకం బిడ్డకి శాపంగా మారింది.
తల్లి కడుపునపుట్టి తల్లి రొమ్మును తన్నిన ఈ రాజకీయ పార్టిలు ఇలాగే ఉన్నతకాలం ఆ తల్లి శోకం 
ఆగనిది పిల్లాడి ఆకలి తీరనిది. 

జై భారతమాత...



                                                                                                                 ప్రతాప్
 

భారత త్రివర్ణ పతాక ఆవేదన....


భారత త్రివర్ణ పతాక ఆవేదన....


నా దేశ భావి భారతా పౌరులారా....!

నా దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి తమ రక్తం ధారపోసి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను కూడా అర్పించారు.
దేశాబవిషతుకోసం తెల్లదోరాలని తరిమి తరిమి కొట్టారు....
ఆనాడు నా దేశ ప్రజల ఆనందాన్ని చూసి గర్వపడ్డాను...
దేశ ప్రగతిని దేశ గౌరవాన్ని చాటి నా భారతా దేశ చిహ్నంగా నన్ను గాలిలో ఎగరవేస్తే ఎంతో ఆనందంగా రెపరెపలాడుతూ ఆకాశాన్ని అంటేల ఎగురుతుంటే....
ఎందరో గొప్ప గొప్ప విరులు త్యగాముర్తులు విరానరులు చేసిన సలంకి అలుపెరగకుండా అలాగే గాలిలో నిత్యం దేశమంతటా ఎగరలనుకున్నాను..
ఆ త్యగాముర్తులందరికీ నే సలాం చెప్తున్నాను......

కానీ 

ఆ త్యగాముర్తులు చెప్పిన విధానాలు మరిచి..
నా దేశ పౌరులే ఒకరినొకరు చంపుకుంటూ....
అహింస మార్గంలోనే నడుస్తూ....
అశాంతి వాతావరణంలో....
స్వచమైన త్రివర్ణ పతాకంలోని మూడు రంగులకి అర్థంకూడ తెలియని
స్వార్థ రాజకీయనాయకులు నన్ను నా దేశాన్ని వాడుకుంటున్నారని తెలిసి.
నాదేశ ప్రజలని హింసించిన చేతులతో నన్ను గాలిలోకి ఎగరవేసి స్వలాభాన్ని ఆశిస్తున్నారని తెలిసి
ఎగరలేక వాలిపోయి తలదిన్చుకున్నాను...

మల్లి నాదేశం మారాలని, నా దేశ ప్రజలు మారాలని మల్లి నేను ఆనందంగా గాలిలో ఎగిరే రోజు రావాలని కోరుకుంటూ...!

మీ
భారతాదేశ త్రివర్ణ పథకం  




ప్రతి భారతీయుడు ఆలోచిస్తాడు అన్న ఊదేశంతో మీ ప్రతాప్ 


Saturday, 30 June 2012

వేల వేల బోతున్న ప్రభుత్వ పాటశాలలు....






ప్రతి ఊళ్ళో ప్రభుత్వ పాటశాలలు...
ప్రతి మండలంలో కళాశాలలు....
ప్రతి జిల్లాలో ఉన్నత చదువులు....

అన్నిచోట్ల `ప్రభుత్వ పాటశాలలు వున్నా ప్రజలందరు తమ పిల్లను
ప్రైవేట్ పాటశాలలో చదివించడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు.

కారణం:

"ప్రభుత్వ"

స్కూల్ పిల్లల స్కూల్కి వెళ్ళే ఏర్పాటు ప్రతిరోజు తల్లిదండ్రులే చూసుకోవాలి.

టీచర్ పాటలు చెప్పటం వరకు మాత్రమే వాళ్ళ బాధ్యత పట్టించుకునే
వాళ్ళు తక్కువ.

90 % తెలుగు 10 % ఇంగ్లీష్.

పగిలిన గోడలు.

కరెంట్ వుండటం కష్టం కంపూటర్లు రూంకి మాత్రమే పరిమితం.

నెల పై, చెట్లక్రింద కూర్చొని చదువు కోవడం.

సూరి వివాన్ని ఏ స్కూల్లో చాదివిస్తున్నావ్రా...?
సూరి : ప్రభుత్వ పాటశాల.


"ప్రైవేట్"

స్కూల్ బస్సు ఊచితం.

క్రమశిక్షణ 100 ఉతిర్నత, స్కూల్ లో చెప్పిన పాటలే కాకుండా పడుకునేంత
వరకు హొంవర్క్.

10 % తెలుగు 90 % ఇంగ్లీష్.

అద్దాల మేడలు.

2 వ తరగాతినుండే కంప్యూటర్ క్లాస్లు.

బెంచిలపై అద్దాల మేడలో కూర్చొని చదువుకోవడం..

సూరి వివాన్ని ఏ స్కూల్లో చాదివిస్తున్నావ్రా...?
సూరి : Modran International English Medium School.




                                                                                                                ప్రతాప్ 

Sunday, 24 June 2012

అమ్మ ప్రేమకన్నా మిన్న ఎమున్నదన్న.


అమ్మ ప్రేమకన్నా మిన్న ఎమున్నదన్న.

అమ్మ అన్న పిలుపు అమృతంకన్నమిన్న..

అమ కన్నా మిన్న ఏమిలేదన్న...

నా జీవం వున్నతవరకు నే మరువనమ్మ...


I LOVE YOU AMMA

ప్రతాప్ 



ఆత్మ విశ్వాసంతో..


ఆత్మ విశ్వాసంతో..



నీపై నివు నమ్మకాన్ని పెట్టుకొని


ప్రయత్నం చేయు తప్పకుండ అనుకున్నది సాధిస్తావ్...!

                                                                                         

                                                                                                                 ప్రతాప్
              


చిన్నదిగా ఆరంభించి పట్టుదలతో సాధిస్తే శికరాన్ని తాకవచ్చు


చిన్నదిగా ఆరంభించి పట్టుదలతో సాధిస్తే శికరాన్ని తాకవచ్చు
ప్రతాప్


గౌడన్నా గోడు వినేవాడు లేడు.



ఉదయాన్నే లేచి చెట్లకి కట్టిన కల్లు తీసుకురావడానికి వెళ్లి సంతోషంగా తిరిగివచ్చిన రోజు కనరకపాయే..!

రాతిరి కట్టిన కళ్ళు పోదున లెక్క సరిపోకపాయే చెట్ల దొంగాలేక్కువాయే..!

తెల్ల కల్లు మరచిపోయే ఎర్ర మందుకి బానిసలయే...!

కల్లు కుండ చూడగానే కళ్ళనిండా నిల్లు పారే..!

ఎవడున్నాడు వినేవాడు గౌడన్నా గోడు..!

  
ప్రతాప్

Saturday, 23 June 2012

వర్షాకాలం


వర్షాకాలం మొదలైంది స్కూల్ పిల్లలు ఆఫీస్ కి

వెళ్ళే వాళ్ళు జాగ్రత్త గా వెళ్ళండి ..

నాళాలు నోర్లు తెరిచాయి..

అనుక్షణం అప్రమతతే

మీకు రక్ష....



ప్రతాప్


కళాకారులు


కొందరు కళాకారులకి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది.


 ప్రతాప్

నాన్న


అమ్మ


ఎవరో వస్తారు


ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురుచూడడం కన్నా పదిమందికి ఊపయోగాపడుతుంది అంటే
మనవాళ్ళ ఐన అంత వరకు మనం కృషి చేయాలి అన్నదానికి నిదర్శనం.



ప్రతాప్




చంటిబిడ్డ కెవ్వుమంటే చాలు, కన్నపేగు కదిలిపోతుంది.




చంటిబిడ్డ కెవ్వుమంటే చాలు, కన్నపేగు కదిలిపోతుంది. చిన్నారి కేరుమంటే చాలు, తల్లిమనసు తుళ్లిపడుతుంది. ఎక్కడున్నా ఒక్క క్షణంలో బిడ్డముందు వాలి అక్కున జేర్చుకుంటుంది. అలాంటి అమ్మే తన బిడ్డను కాదనుకుని చేతులారా మరో చేతికి అందించిందంటే? అందుకు కారణం ఆ కన్నతల్లి కర్కశురాలా, కారుణ్యం లేనిదా, కాఠిన్యురాలా? బిడ్డ చిరునవ్వు చూసి లోకాన్ని మరచిపోయే తల్లుల్ని చూశాం. పసికందుకోసం కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదురీదే అమ్మల్ని చూశాం. అమ్మతనపు కమ్మదనం సాక్షిగా, మమతల మాధుర్యం తోడుగా ప్రపంచాన్ని ఎదుర్కొనే కడుపుతీపిని చూశాం. కానీ మంచాల మండలంలోని తల్లులు తమ ప్రేమాప్యాయతలకన్నా, ముద్దుమురిపాలకన్నా బిడ్డ కడుపు నిండటమే ముఖ్యమనుకున్నారు. తమవద్ద ఉండి పస్తులుండేకన్నా ఎక్కడున్నా తమ బిడ్డలు సుఖంగా ఉంటే చాలనుకునే నిస్సహాయస్థితిలో వారున్నారు. పిల్లల భవితవ్యంకోసం గత్యంతరంలేక అనురాగాన్ని గుండెలోతుల్లో అదుముకున్న మాతృమూర్తులు వారు! పేదరికంముందు ఓడిపోయిన పేగుబంధపు దీనగాథలు వారివి.








ప్రతాప్ 

ఆడపిల్ల






ఆడపిల్లలను కడుపులో ఉండగానే స్కాన్ లో చూసి ఎందుకు హత్య చేస్తున్నారు.?

పుట్టిన వెంటనే చెత్తకుప్పలో ఎందుకు పరవేస్తున్నారు..?

ఇది ఎలా ఆపగలం....?

లోకం తెలియని ఆ పసికందు చేసిన పాపం ఏమిటి...?

దీనికి మీ సమాధానం ఏంటి...?



ప్రతాప్

Monday, 18 June 2012

I Love You అమ్మ


వరుణ దేవునికి స్వాగతం

వరుణ దేవునికి స్వాగతం



తొలకరి జల్లుతో నేల తడిసిన వేల.

పాపాయి బుగ్గపై చిరునవ్వు చిందిన వేల.

రైతన్న యేదలో ఆనందం ఉప్పొంగినవేల


సేను సెలక నీటితో నిండిన వేల.

మనసుపుర్తిగా.......!
ఓ వరుణ దేవ నీకు స్వాగతం పలుకుతున్న...

                                                                                             
                                                                  

Sunday, 17 June 2012

గల్ఫ్ జీవితం


మీలో ఎవరికైనా ఈ పోస్ట్ ద్వార మనసు బాదకలిగుంటే నన్ను క్షమించండి.

మన్నిసి అన్నవాడు తన కోసం కాకుండా తనవల్ల కోసం ఎంతటి కష్టాన్నైనా చేయడానికి సిద్ధ పడతాడు.
ఊర్లల్లో అందరు చూస్తుంటాం అంటారు మీవాడు దుబాయి వెళ్ళాడు నేకేంటమ్మ వాడు నెల నెల డబ్బులు పంపిస్తున్నాడు నీకేం అని కదా ..........!
కానీ వాళ్ళు పడేకష్టాలు ఎవరికీ కనపడవు ఎవరు చెప్పుకోరు కానీ మనవాళ్ళు గుల్ఫ్ లో ఎలావుంటారు....?. 
ఏంచేస్తారు కష్టాలు ఏంటి ..............?
ఇంట్లో మనం ప్రోదున 6 గంటలకు లేవాలంటే చాల కష్టం కానీ వాళ్ళు 04:30 గంటలకి లేచి రెడీ ఐ టిఫీన్ తీసుకొని బస్సు ఎక్కివెళ్ళాలి బస్సు మిస్అయిన్ద్ధ ఒకరోజు జీతం కట్.

కంపెనీ వాళ్ళు పెట్టిన టిఫీన్ వాళ్ళకి భోజనం......


గుల్ఫ్ లో అడుగుపెట్టమా ఒకరికింద అణిగి బ్రతకడమే.......

కానీ కష్టాన్ని కూడా నవ్వుతు పనిచేయడంమే మనవాళ్ళ యక్క గొప్పదనం

ఒకరికి ఒకరు సహాయపడుతూ కాలాన్ని గడిపేస్తుంటారు    

పనిలో వుండగా దొరికిన కాసింత సమయాన్ని ఇలా గడుపుతారు

ఇంటినుండి వలసవచిన అక్కడకూడా వలసవేల్లసి వుంటుంది, పనికోసం రోజులవారిగా ప్రాంతాలు మరుతువుంటారు .

రాతిరి అయ్యేసరికి కాసింత కాలక్షేపం....

కానీ ఒక్కోసారి బరించలేనిది బాద మనవాళ్ళు గుర్తురావడం కళ్ళలో తప్ప కల్లనిన్డుగా చూడలేకపోవడంకన్నీళ్ళతో మనల్ని మనం ఒధర్చుకోవడం


కానీ చివరగా ఒక్కరోజు హ్యాపీగా అందంగా వుండే రోజుతన ఫ్లైట్ టికెట్ తన చేతికి వచ్చిన రోజు 
ఇంటికి వెళ్తున్న అని అతనికి తెలిసిన రోజు.

తన వాళ్ళని తన కళ్ళతో చుసిన రోజు మల్లి అప్పుడు అతని కళ్ళలో నిజమైన ఆనందం వచ్చిన రోజు.

        
               ఇది గల్ఫ్ జీవితం..


మీ
మిత్రుడు                                                                       


అమ్మ నాన్నలని ప్రేమించు..!


Saturday, 9 June 2012

జై తెలంగాణా..! జై జై తెలంగాణా...!!



ఏమిసేసిన ఎన్నిసేసిన ఎప్పటినుండో సేసిన ఇప్పటికీ మనవాళ్ళు తెలంగాణా కోసం పోరాటం సేస్తనే ఉండ్రు ఐన తెలంగాణా రాలే..!

ఆకలి వేసినవాడికి తెలుసు ఆకలి బాధా ఏంది అనేది.
రోజు ACలో పండి, AC కార్లో తిరిగి, బిరియాని తినేవాళ్ళకి ఎంతెలుసు.
పంటకి నిరంధక కంట నిరు చిందిన రైతన్నకి తెలుసు.

పోలంపనికి వేల్లిన్న అవ్వ అయ్యా రాకపాయే కవులుదారు పైసలు ఎచ్చేనో లేదో  కడుపులో కలవట్టే అని బిడ్దల ఆకలి కేకకి తెలుసు.చేతిలో డిగ్రీ వుండి పరువుగా బతుకుదాం అనుకున్న పోరగాడు పరాయి దేశానికి పయనం బానిసలుగా పనులు చేస్తున్న ప్రతిఒక్క పోరాగాడికి తెలుసు తెలంగాణా ఎందుకు కావాలి అని.

కేంద్రం, ప్రభుత్వం ఏమి చేస్తున్నాయి ఈరోజు తెలంగాణా అంటే జైల్లో పెట్టడం. గృహనిర్భంధం చేయడం.
ఒకసారి ఒక్కసారి ఆలోచించడి.ఈ కమిటి ఆ కమిటి అని కాలాన్ని వృధాచేయడం తప్ప.

ఒక మాట అడుగుతాను మా పార్టి తేగలదు, మా పార్టీయే తేగలదు మాకు వోటేయండి మమ్మల్ని గెలిపించండి అని అడిగే బదులు. వోట్లు అడుకున్నే సిగ్గు లేని నాయకులారా తెలంగాణా తెచ్చాకే మాకు వోటేయండి అనే ఒక్క నాయకుడైన వున్నడా.

అ నాటి నుండి ఈ నాటివరకు ఎందరో ప్రాణాలు వొదిలారు ఎందరో తెలంగాణ కోసం ఆహుతి అయినారు కానీ తెలంగాణా రాలేదు అంత రాజకీయం రాజికియ కుట్ర.

పెట్టండి మల్లి ఎలేచ్షన్స్ పెట్టండి ఎవడబ్బ సొమ్ము కట్టేలుకొట్టి సంపాదించారా మోపులుమోసి సంపాదించారా...?

పెట్టండి మల్లి ఇంకోసారి పెట్టండి కానీ ప్రతి రాష్టం లో ఒక సామాన్యుడి జీవన విధానం గూర్చి కూడా ఆలోచించడి.
సమాజానికి మేలుచేయక పోయిన పరవాలేదు కానీ దున్డగులుగా మరి మాత్రం దోచుకోకండి.

ఇవన్నీ ఇప్పటివరకు చుసిన ప్రతిపౌరుడు చేస్తుంది ఇప్పుడు తెలంగాణా మాట అంటేనే మొదటి రోజు ని వెనుకల 1000 వుంటే రెండవ రోజు 500  మూడవరోజు 200 నాల్గవరోజు 50 చివరకి మిగిలేది శూన్యం. ఎందుకంటే ఒక్కరోజు పనిచేయకపోతే ఇప్పటికే పొట్టగడవడం కష్టంగా వుంది. రెండవరోజు కొంచెం కష్టం మూడవరోజు ఇంకా కష్టం, తనపై ఆధారపడిన వారిని కాదని ఏమిచేయలేని పరిస్థితి చివరకు విదులకి అజరుకవడం చూసి చూడని ప్రభుత్వం ఎన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు ఇలా.

వోట్లు కొనే రాజకియనయకులున్నతకాలం, డబ్బులుతిసుకొని వోట్లు వేసేవాళ్ళు వున్నతహకాలం ఈ జీవితాలు ఇంతే మారవు.

అలోచించి వోటేయడం నేర్చుకో, లేదంటే వోటేయడం మనేయు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో ఇప్పుడు పెట్టె ప్రతిపైస వాడుగేలిచక అనపైస కూడా వదలకుండా మునిమనవాళ్ళకి కూడా సంపాదిస్తాడు అని మాత్రం మర్చిపోకు.

ఆకలి కేకలను, అమరావిరులను మరవకు.

తెలంగాణా పోరుబాటను అసలు మరవకు.
తెలుసుకో ఈకనైన అసలైన నాయకుణ్ణి ఎన్నుకో.

తెలంగాణా వాదాన్ని గెలిపించుకో........


జై తెలంగాణా..!
జై జై తెలంగాణా...!!


 మీ ప్రతాప్  


Thursday, 17 May 2012

నా ప్రాణమా


నా ప్రాణమా
నా గుండెలో కొలువు దీరిన రూపమా..!
నీకై నే బ్రతికివున్న
నీకోసమే వేచివున్న..!

నే గిసిన నిరుపం నా మదిలో,
మెదులుతుంది ప్రతిక్షణం నా కన్నులలో..!
నాలో నీ నిరుపాన్ని బాద్ర పరచుకున్న
నీ రాకకై వేచివున్న..!