Saturday, 9 June 2012

జై తెలంగాణా..! జై జై తెలంగాణా...!!



ఏమిసేసిన ఎన్నిసేసిన ఎప్పటినుండో సేసిన ఇప్పటికీ మనవాళ్ళు తెలంగాణా కోసం పోరాటం సేస్తనే ఉండ్రు ఐన తెలంగాణా రాలే..!

ఆకలి వేసినవాడికి తెలుసు ఆకలి బాధా ఏంది అనేది.
రోజు ACలో పండి, AC కార్లో తిరిగి, బిరియాని తినేవాళ్ళకి ఎంతెలుసు.
పంటకి నిరంధక కంట నిరు చిందిన రైతన్నకి తెలుసు.

పోలంపనికి వేల్లిన్న అవ్వ అయ్యా రాకపాయే కవులుదారు పైసలు ఎచ్చేనో లేదో  కడుపులో కలవట్టే అని బిడ్దల ఆకలి కేకకి తెలుసు.చేతిలో డిగ్రీ వుండి పరువుగా బతుకుదాం అనుకున్న పోరగాడు పరాయి దేశానికి పయనం బానిసలుగా పనులు చేస్తున్న ప్రతిఒక్క పోరాగాడికి తెలుసు తెలంగాణా ఎందుకు కావాలి అని.

కేంద్రం, ప్రభుత్వం ఏమి చేస్తున్నాయి ఈరోజు తెలంగాణా అంటే జైల్లో పెట్టడం. గృహనిర్భంధం చేయడం.
ఒకసారి ఒక్కసారి ఆలోచించడి.ఈ కమిటి ఆ కమిటి అని కాలాన్ని వృధాచేయడం తప్ప.

ఒక మాట అడుగుతాను మా పార్టి తేగలదు, మా పార్టీయే తేగలదు మాకు వోటేయండి మమ్మల్ని గెలిపించండి అని అడిగే బదులు. వోట్లు అడుకున్నే సిగ్గు లేని నాయకులారా తెలంగాణా తెచ్చాకే మాకు వోటేయండి అనే ఒక్క నాయకుడైన వున్నడా.

అ నాటి నుండి ఈ నాటివరకు ఎందరో ప్రాణాలు వొదిలారు ఎందరో తెలంగాణ కోసం ఆహుతి అయినారు కానీ తెలంగాణా రాలేదు అంత రాజకీయం రాజికియ కుట్ర.

పెట్టండి మల్లి ఎలేచ్షన్స్ పెట్టండి ఎవడబ్బ సొమ్ము కట్టేలుకొట్టి సంపాదించారా మోపులుమోసి సంపాదించారా...?

పెట్టండి మల్లి ఇంకోసారి పెట్టండి కానీ ప్రతి రాష్టం లో ఒక సామాన్యుడి జీవన విధానం గూర్చి కూడా ఆలోచించడి.
సమాజానికి మేలుచేయక పోయిన పరవాలేదు కానీ దున్డగులుగా మరి మాత్రం దోచుకోకండి.

ఇవన్నీ ఇప్పటివరకు చుసిన ప్రతిపౌరుడు చేస్తుంది ఇప్పుడు తెలంగాణా మాట అంటేనే మొదటి రోజు ని వెనుకల 1000 వుంటే రెండవ రోజు 500  మూడవరోజు 200 నాల్గవరోజు 50 చివరకి మిగిలేది శూన్యం. ఎందుకంటే ఒక్కరోజు పనిచేయకపోతే ఇప్పటికే పొట్టగడవడం కష్టంగా వుంది. రెండవరోజు కొంచెం కష్టం మూడవరోజు ఇంకా కష్టం, తనపై ఆధారపడిన వారిని కాదని ఏమిచేయలేని పరిస్థితి చివరకు విదులకి అజరుకవడం చూసి చూడని ప్రభుత్వం ఎన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు ఇలా.

వోట్లు కొనే రాజకియనయకులున్నతకాలం, డబ్బులుతిసుకొని వోట్లు వేసేవాళ్ళు వున్నతహకాలం ఈ జీవితాలు ఇంతే మారవు.

అలోచించి వోటేయడం నేర్చుకో, లేదంటే వోటేయడం మనేయు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో ఇప్పుడు పెట్టె ప్రతిపైస వాడుగేలిచక అనపైస కూడా వదలకుండా మునిమనవాళ్ళకి కూడా సంపాదిస్తాడు అని మాత్రం మర్చిపోకు.

ఆకలి కేకలను, అమరావిరులను మరవకు.

తెలంగాణా పోరుబాటను అసలు మరవకు.
తెలుసుకో ఈకనైన అసలైన నాయకుణ్ణి ఎన్నుకో.

తెలంగాణా వాదాన్ని గెలిపించుకో........


జై తెలంగాణా..!
జై జై తెలంగాణా...!!


 మీ ప్రతాప్  


No comments:

Post a Comment