Saturday, 14 April 2012

రోడ్డుపై నేను అమ్మ


రోడ్డుపై నేను అమ్మ
అప్పుడే 
చీకటి పులుముకుంటుంది.
చలి మెల్లిగా పంజవిసరుతుంది
శాలువకప్పుకున్న అమ్మ 
నేను దురం తెలియకుండానే
ఇద్దరం నడుస్తున్నాం
ఏవో చెబుతోంది అమ్మ.

నేడు
అదే దూరం
అదే రోడ్డు 
అదే చలి 
చెంత అమ్మలేదు 
అయిన 
ఎన్నో సంగతులు 
నన్ను కప్పేవున్నాయి 
శాలువాలా

మరవలేని జ్ఞాపకంలా





   


ఐ లవ్ యు అమ్మ..!

No comments:

Post a Comment