Monday, 23 April 2012

మానస మాటవినవా......!


పున్నమి వేల పండు వెన్నెల,

నే ఒంటరినై నిలిచినా వేల,

నా చేయి తన తోడుకై వెతికినా వేల,

ని మువ్వల చప్పుడు నా చెవులను చేరిన వేల,

ని రూపం నా ఏదని తాకిన వేల,

నా కన్నీటి చుక్కలు నా చెక్కిలి ని తడిపి నా ఎదకు తాకిన వేల,

మనసుపడిన గాయం మరువలేనిది,

బ్రతికి ఉన్నతకాలం నిన్ను మరువలేనన్నది.

Wednesday, 18 April 2012

పెళ్లి


పెళ్లి ఇద్దరు మనుషులను ఒక్కటిచేసే బంధం



రెండు అక్షరాల పదం ...

ముడుముల్ల బంధం...

ఏడడుగుల అనుబంధం మాత్రమే కాదు పెళ్ళంటే....! 


ధర్మేచా... అర్తేచా... కామేచ...మొక్షేచా... నాతిచరామి...!

అని దైవశాక్షిగా 

పంచ భూతముల సాక్షిగా వేద మంత్రాల నడుమ జరిగేది పెళ్లి ..




విడలేని బంధం లా.....   ని తోడువుంటాను అని..


దైవశాక్షిగా ప్రమాణం చేస్తూ ......!


 ధర్మార్థ కమములలోన ఏనాడూ ని తోడు ఎన్నడు నే విడిచిపొను 

ఈబసచేసి ఇక నిండు నూరేళ్ళు ని నిడనైనిలిచి కాపాడతాను...
 
అని వేసిన బ్రమ్మ ముడి విడకుండా

ని అన్గుటిని పట్టి నడిచిన అడుగులు సాక్షిగా ని నీడనై ఉంటానని...




మంగళ వాయిద్యాలు, మేల తలాల మధ్య అంగరంగ వైబవంగా జరుగుతున్న పెల్లిసంధడిలో ఇద్దరి ముకంలో సిగ్గుతో కూడుకున్న చిరునవ్వు. మెల్లిగా ఒకరినొకరు చూసుకుంటూ తనలోతాను సిగ్గుపడుతూ అంగులిటిని త్రొక్కి...

తాళి కట్టే వేలలో శిరస్సు వంచి మూడు ముళ్ళు వెంయించుకునే ఆ పెళ్లి 
కూతురు తన తోడు తన నిడ ఐవుందే తన వాడు తన తోడు అవుతున్నాడు అని 
కోటి ఆశలతో కోటేసిగ్గుతో తలవంచి తలికట్టిన్చుకుంటుంది.
అప్పుడు తన పడే అందం అంతులేనిది.


మెట్టెల సవ్వడి...


ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అనుబధం, ఆనందం, అన్ని ఒకరిపై ఒకరు పెంచుకోవాలని
తలంబ్రాలు పోసుకొని..  


అర్ధం చేసుకునే మనసు
అనుభవాన్ని పెంచే వయసు
అనుబంధాన్ని పంచె సొగసు
ఇవే నూతన దంపతులకు విశ్వ వారాల జల్లుల ఆశిస్సు..

నా మనసుకి తోచినది నా మాటల్లో చెప్పను ఇందులో ఏమైనా పొరబాట్లు వుంటే మన్నించండి ఫ్రెండ్స్.....






మీ మిత్రుడు

Tuesday, 17 April 2012


కమ్మని కలలా కనిపించే నువ్వు

ఎప్పటికి నాకు అవుతావు చిరునవ్వు

నిన్ను ప్రేమించే నా గుండె సవ్వడి

చేరాలంటోంది ని వెచ్చని ఒడి.....


Sunday, 15 April 2012

నా మనసులోని మాట




అమ్మలోని  అలన.....

నాన్నలోని  లాలన..... 

మిత్రులతో ఆడిన  ఏటిగట్టు నిడన......

చదువులమ్మ ఒడిలోనా గురువులతో గడిపిన....

గురుతుంది క్షణక్షణము నా చిన్ననాటి జీవితము.......

మరువలేను ఎన్నటికి మనసులోని జ్ఞాపకలాన్ని చివరివరకు......!





మీ మిత్రుడు

Saturday, 14 April 2012

రోడ్డుపై నేను అమ్మ


రోడ్డుపై నేను అమ్మ
అప్పుడే 
చీకటి పులుముకుంటుంది.
చలి మెల్లిగా పంజవిసరుతుంది
శాలువకప్పుకున్న అమ్మ 
నేను దురం తెలియకుండానే
ఇద్దరం నడుస్తున్నాం
ఏవో చెబుతోంది అమ్మ.

నేడు
అదే దూరం
అదే రోడ్డు 
అదే చలి 
చెంత అమ్మలేదు 
అయిన 
ఎన్నో సంగతులు 
నన్ను కప్పేవున్నాయి 
శాలువాలా

మరవలేని జ్ఞాపకంలా





   


ఐ లవ్ యు అమ్మ..!

భూమాతకి సిగ్గుచేటు

ఆడది ఈ సృష్టికి ఒక తల్లి

ఆడది అన్న పదం లేనిదీ ఈ యొక్క జగతికి జననం అన్నది లేదు ఒక్క మరణం తప్ప.

ప్రతి పుట్టుకకు కారణం తల్లి కానీ ఆ తల్లి కన్నపేగుని కలుస్తున్నారు.

ఏ దేశం ఎగిన ఎందుకాలిడినా,   పిటమేక్కినా, ఎవ్వరేననిన,
పొడరానితల్లి భూమిభారతిని అని అన్నాడు మన కవి,
శ్రీ రాయలప్రోలు సుబ్బారావుగారు.

కానీ 

ఏది నా దేశ ప్రగతి ఏది మన దేశం యొక్క జాగృతి పుట్టిన పసిగుడ్డును చంపడమా.....!

ఒక వైపు అక్రమాలు, పరాక్రమాలు ఎక్కువై నా ఈ దేశం ఎప్పుడు బాగుపడుది అను తరుణంలో  మరి ఇంత అరచాకమా...!

మువ్వన్నలరని పసికందును నిలువేతున్న పోట్టనపెట్టుకున్నావ్ తను అడజేన్మనేత్తడమే పాపమా..!
నివు ఒకతల్లికే పుట్టవన్న మాటని మరిచావా..!


ఒకరోజుకి 24  గంటలు గడవనిదే ఒక రోజు ఎలాపుర్తికదో ఈ లోకంలో అడ పుట్టుక లేనిది సృష్టి ముందుకునడవదు అన్న సత్యాన్ని గ్రహించాలి.

ఒక్కక్షణం ఆలోచించడి మనం చేసే పని ఏంటి అని దయచేసి ఒక పసిగుడ్డుని చంపకండి.



పుట్టిన బిడ్డ అడ మగ అన్నది ముక్యం కాదు మనం మన రక్తం పంచుకుపుట్టిన బిడ్డని ఎలాపెంచాలి అని ఆలోచిద్దాం తన బంగారు భావిషతుకి భాటవేద్ధం.


ఒక కోడిపెట్ట తన పిల్లలపై కన్నేసిన రాబదువుతో తన ప్ర్రానాలకి తెగించి పోరాడుతుంది తన పిల్లలని రక్షించుకుంటుంది. 

మనం మానవులమై కనీసం మనిషిల ఆలోచిద్దాం మనపిల్లకి బంగారు బావిశాత్తునిద్దం 


మీ పాదాలకు నమస్కరించి చెప్తున్నా

కనీసం తనకంటూ ఒక దారిని చూపండి ప్లీజ్.









మీ మిత్రుడు 

Friday, 13 April 2012

మిత్రులందరికీ ఒక చిన్నమాట..!


మిత్రులందరికీ ఒక చిన్నమాట..!


మనం ప్రతిరోజు చూస్తున్నాం  ఎన్నో చోట్ల ఎందరో హాస్పిటల్లలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
వారి ప్రాణాలు కపడానికి డాక్టర్స్ కూడా చాల ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రతి తల్లి తన కన్నపేగు కోసం తల్లడిల్లుత్తుంది.
తల తాకట్టు పెట్టైనా సరే తనవాళ్ళని కాపాడుకోవాలి అని ప్రయత్నాలు చేస్తుంది.

ఇందులో అందరిని కాకపోయినా మనం ఒక్కరం ఒకప్రానాన్ని కపడొచ్చు.
అది మనం రక్తదానం చేయడం వాళ్ళ.

రక్త దానాన్ని చేయండి ఒక జీవితాన్ని కాపాడండి.
ఆపదలో ఉన్నవారికి మనం చేసే ఈ చిన్ని సహాయం ఒక తల్లి గుండెని కాపాడుతుంది.

కనుక నా మిత్రులందరికీ నా విన్నపం మీకు దగ్గరిలో వున్నా రక్త శిబిరానికి వెళ్లి రక్తదానం చేయండి ఒక జీవితాన్ని కాపాడండి.




నా ఈ చిన్న ప్రయత్నం వాళ్ళ నా మిత్రులు కూడా ఒక మంచి కార్యానికి ముందుకివేల్తారు అని ఆశిష్తు 




మీ మిత్రుడు  

Thursday, 12 April 2012

అమ్మ అంటే



                                               అమ్మ అంటే ఓ అద్బుతం,
                                               అమ్మ అంటే ఒక పురుపం, 
                                               అమ్మ అంటే ఒక అద్బుతకావ్యం,
                                               మురిపాలు, జ్ఞపకాలు,
                                               లాలీ పాటలు, గోరుముద్దలు,
                                               అక్షరాలు, అలింగానాలు,
                                               నడక, నడత,
                                               అనురాగాలు,అత్మియతలు,
                                               ఆనంద సమయాలు,
                                               కన్నీళ్లను వర్షేంచే క్షణాలు,
                                               ఇంకా ........
                                               అందమైన అనుబంధం, 
                                               అంతులేని ఆనురాగంతో వెలసినది.




ఐ లవ్ యు అమ్మ 


మిత్రులందరికీ ఒక చిన్న మాట

మనిషికి విలువైనది ప్రాణం అది మనకుతెలియకుండానే ఎప్పుడైనా ప్రమాదంలో పడవచ్చు 
అల ప్రమాదంలో ఉన్నవారిని ఒక మనిషిగా కాపాడాల్సిన బాధ్యత మనలో వుంది.
సరియైన సమయంలో 108 కి (అంబులెన్స కి) సమాచారాన్ని అందిద్దాం ఒక ప్రాణాన్ని కాపాడుదాం 

మనం ట్రాఫ్ఫిక్ లో వెళ్తున్నపుడు మన వెనుకల వేగంగా అంబులెన్సు వస్తుంది అంటే ఎవరో ప్రమాదంలో వున్నారు అని అర్థం మనం అబులేన్సుకి వేల్లనిద్ధం ఒక ప్రాణాన్ని కాపాడుదాం.

దురష్టం మనవేనుకలే అన్నట్టుగా మన హైదరాబాద్ లో ఒక వాహనం ధాటి వెళ్ళాలి చాల కష్టం కానీ మనకు ఎంత అర్జెంట్ పని వున్నా 5  నిముషాలు ఆగి అంబులెన్సు ని వెళ్ళనివ్వండి.   

ఈ చిన్న క్లిప్ చూస్తారని ఆశిస్తు




మీ మిత్రుడు  

  

Wednesday, 11 April 2012

ఓ ప్రియా..

నా ప్రతి శ్వాస నీదై..
నా అడుగడుగున నీవై..
నా ప్రతి పలుకూ నీకై..
నా ప్రతి తలపు.. తొలి వలపు నీవై..


ఈ ప్రాణము.. ఈ జన్మము.. నీకే అంటూ..
నేనన్నే నీకోసం ఒక కానుకగ చేస్తున్నా.. ఓ ప్రియా..