Sunday, 15 July 2012

స్వర రాగా గంగా ప్రవాహమే అంగాత్మ సందన యోగమే...





స్వర రాగా గంగా ప్రవాహమే అంగాత్మ సందన యోగమే...
ప్రాప్తే వసంతేతి కాళికే పలికే కుహు గీతిక
గాన సరసీరుహ మాలిక స్వర రాగా గంగా ప్రవాహమే........

చరణం:

కుండల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్లకే
పిల్లన గ్రోవిలో పిలవని మోవిలో కురిసెను రాగం ఈ నాటికీ
మట్టింటి రాయే మాణిక్య మై పోయే సంగీత రత్నాకరాన
స్వర సప్త కాలే కెరటాలు కాగ ఆ గంగా పొంగింది లోన
స్వర రాగా గంగా ప్రవాహమే అంగాత్మ సందన యోగమే

చరణం:

చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమ వీడి వినిపించు రాగ లనతలు లే
ఈ ఈ చక్ర వాకాలు ఎగిరే చకోరాలు జగమంత విహరించు రాగాలు లే
పిలిచే శాకుంతలు పలికే దిగంతాలు పులకింత ల పుష్య రాగాలు లే
మాలి సంధ్య దీపాలు గుడి గంట నాదాలు మౌనాక్షరీ గణ వేదాలు లే
స్వర రాగా గంగా ప్రవాహమే అంగాత్మ సందన యోగమే
ప్రాప్తే వసంతేతి కాళికే పలికే కుహు గీతిక
గాన సరసీరుహ మాలిక స్వర రాగా గంగా ప్రవాహమే



                       ప్రతాప్




Thursday, 5 July 2012

64 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో..




64 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో..
గొప్ప సంస్కృతిని పోదిగివున్న ఈ పసిడి దేశంలో...
భుతల్లి గర్భశోకం ఎందుకు పెడుతుంది....
తనబిడ్దల ఆకలిని తను ఎందుకు తిర్చలేకపోతుంది...
కన్నతల్లి కంట శోకం బిడ్డకి శాపంగా మారింది.
తల్లి కడుపునపుట్టి తల్లి రొమ్మును తన్నిన ఈ రాజకీయ పార్టిలు ఇలాగే ఉన్నతకాలం ఆ తల్లి శోకం 
ఆగనిది పిల్లాడి ఆకలి తీరనిది. 

జై భారతమాత...



                                                                                                                 ప్రతాప్
 

భారత త్రివర్ణ పతాక ఆవేదన....


భారత త్రివర్ణ పతాక ఆవేదన....


నా దేశ భావి భారతా పౌరులారా....!

నా దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి తమ రక్తం ధారపోసి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను కూడా అర్పించారు.
దేశాబవిషతుకోసం తెల్లదోరాలని తరిమి తరిమి కొట్టారు....
ఆనాడు నా దేశ ప్రజల ఆనందాన్ని చూసి గర్వపడ్డాను...
దేశ ప్రగతిని దేశ గౌరవాన్ని చాటి నా భారతా దేశ చిహ్నంగా నన్ను గాలిలో ఎగరవేస్తే ఎంతో ఆనందంగా రెపరెపలాడుతూ ఆకాశాన్ని అంటేల ఎగురుతుంటే....
ఎందరో గొప్ప గొప్ప విరులు త్యగాముర్తులు విరానరులు చేసిన సలంకి అలుపెరగకుండా అలాగే గాలిలో నిత్యం దేశమంతటా ఎగరలనుకున్నాను..
ఆ త్యగాముర్తులందరికీ నే సలాం చెప్తున్నాను......

కానీ 

ఆ త్యగాముర్తులు చెప్పిన విధానాలు మరిచి..
నా దేశ పౌరులే ఒకరినొకరు చంపుకుంటూ....
అహింస మార్గంలోనే నడుస్తూ....
అశాంతి వాతావరణంలో....
స్వచమైన త్రివర్ణ పతాకంలోని మూడు రంగులకి అర్థంకూడ తెలియని
స్వార్థ రాజకీయనాయకులు నన్ను నా దేశాన్ని వాడుకుంటున్నారని తెలిసి.
నాదేశ ప్రజలని హింసించిన చేతులతో నన్ను గాలిలోకి ఎగరవేసి స్వలాభాన్ని ఆశిస్తున్నారని తెలిసి
ఎగరలేక వాలిపోయి తలదిన్చుకున్నాను...

మల్లి నాదేశం మారాలని, నా దేశ ప్రజలు మారాలని మల్లి నేను ఆనందంగా గాలిలో ఎగిరే రోజు రావాలని కోరుకుంటూ...!

మీ
భారతాదేశ త్రివర్ణ పథకం  




ప్రతి భారతీయుడు ఆలోచిస్తాడు అన్న ఊదేశంతో మీ ప్రతాప్